పిక్ టాక్ : ‘మనం ఊగుదమే బాలా’ అంటూ హైప్ పెంచేస్తున్న జడల్..!

పిక్ టాక్ : ‘మనం ఊగుదమే బాలా’ అంటూ హైప్ పెంచేస్తున్న జడల్..!

Published on Aug 27, 2026 10:01 PM IST

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి ‘ఏశనాగుల’ అనే మాస్ ఫోక్ సాంగ్ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ పాటపై హైప్ పెంచేస్తున్నారు. ఇప్పటికే అందాల భామ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పంచుకున్న ఒక వర్కింగ్ స్టిల్ నెట్టింట వైరల్‌గా మారింది. “వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది..” అంటూ కీర్తి సురేష్ సరదాగా చేసిన ట్వీట్‌కు నాని ఇప్పుడు మరో పిక్‌తో రిప్లై ఇచ్చాడు.

‘మనం ఊగుదమే బాలా’ అంటూ షూటింగ్ గ్యాప్‌లో ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చుని ఒకరినొకరు చూసుకుంటున్న ఈ లొకేషన్ పిక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని క్యారెక్టర్ లుక్‌కు తగ్గట్టుగా అల్లిన జడలతో కనిపించడం, ఆయన సరసన కీర్తి సురేష్ ట్రెడిషనల్ అండ్ రఫ్ లుక్‌లో నవ్వుతూ ఉండడం ఈ వర్కింగ్ స్టిల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ సాంగ్‌లో కీర్తి సురేష్ స్పెషల్ పర్ఫార్మెన్స్, నాని ఊరమాస్ స్టెప్పులతో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు