డెబ్యూ డైరెక్టర్ తో నాని కొత్త చిత్రం.

డెబ్యూ డైరెక్టర్ తో నాని కొత్త చిత్రం.

Published on May 21, 2020 1:09 AM IST

నాచుర‌ల్ స్టార్ నాని మ‌రో ఆస‌క్తిక‌ర‌ సినిమాకు సంత‌కం చేశారు. డైరెక్ట‌ర్‌ సుకుమార్ వ‌ద్ద అసోసియేట్‌గా ప‌నిచేస్తున్న శ్రీ‌కాంత్ ఓడెల ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం కానున్నారు. ఇదివ‌ర‌కు ప‌డి ప‌డి లేచే మ‌న‌సు చిత్రాన్ని నిర్మించి, ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం చిత్రాన్ని నిర్మిస్తోన్న సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. శ్రీ‌కాంత్ ఓడెల చెప్పిన క‌థ అద్భుతంగా ఉంద‌నీ, నాని ఇప్ప‌టివ‌ర‌కూ చెయ్య‌ని క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో చెయ్య‌నున్నార‌నీ తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి.

ఇక నాని నటించిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో హీరో సుధీర్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణతో నాని టక్ జగదీశ్ అనే చిత్రంలో నటిస్తుండగా ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మంచి ఊపు మీదున్న నాని వరుసగా చిత్రాలు ప్రకటిస్తూ పోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు