‘నాని’ స్పోర్ట్స్ డ్రామా బాగా వస్తుందట !

‘నాని’ స్పోర్ట్స్ డ్రామా బాగా వస్తుందట !

Published on Nov 16, 2018 3:42 AM IST

‘మళ్ళీ రావా’ చిత్రంతో హిట్ కొట్టిన దర్శకుడు గౌతం తిన్ననూరి దర్శకత్వంలో.. నాని ‘జెర్సీ’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందుతుంది. కాగా, ఈ చిత్రం ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలో.. ఓ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్ చాలా వేగంగా జరుగుతుందని.. సీన్స్ అనుకున్నదాని కంటే బాగా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నిర్మాత సూర్య దేవర నాగ వంశి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో నాని సరసన కన్నడలో యూటర్న్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది. అయితే క్రికెట్ నేపథ్యంలో రానున్ ఈ చిత్రానికి విజువల్స్ కీలకం కానున్నాయి. దాంతో వీఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగుండాలని నాని ఈ చిత్రానికి పారితోషకం విషయంలో నిర్మాతకు చాలా ఫేవర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు