తన సహజమైన నటనతో, మంచి టైమింగ్ ఉన్న డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరో నాని. గత కొంతకాలంగా తనను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసే హిట్ కోసం ఎదురుచూసిన నాని, తాజాగా ఒకేరోజు విడుదలైన ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాల ద్వారా మంచి కమర్షియల్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో నాని దర్శకుడు మారుతీతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
‘భలే భలే మగాడివోయ్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు అప్పుడే మొదలయినట్లు తెలుస్తోంది. నాని తన డబ్బింగ్ పార్ట్‌ను ఇప్పటికే మొదలుపెట్టేశారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్, పోస్టర్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. లావణ్య త్రిపాటి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


