
యువహీరో నాని ‘ఈగ’ సినిమాలో చిన్న పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు. కనిపించింది కాసేపే అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు.రాజమౌళికి తనకున్న సాన్నిహిత్యంతో ‘బాహుబలి’ ఆడియో లాంచ్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి సిద్ధమయ్యాడు. ఈ వేడుక ఆదివారం తిరుపతిలో వెంకటేశ్వర యునివర్సిటి ప్రాంగణంలో ఘనంగా జరగనుంది.
అయితే నిన్న నాని నటుస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ షూటింగ్ సమయంలో గాయపడడంతో ఈ వేడుకకు దూరమవుతునట్టు ట్విట్టర్ లో తెలిపాడు. ఈ విషయాన్ని రాజమౌళి కూడా షేర్ చేస్తూ తనని మిస్ అవ్వనున్నట్లు తెలిపాడు. రేపు జరగబోయే వేడుక సుమ నిర్వహించనుంది. బాహుబలి ది బిగినింగ్ ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
Leg injury in BBM climax action sequence .. Unable to be a part of #BaahubaliAudio .. My best wishes to the team and the fans on the launch.
— Nani (@NameisNani) June 12, 2015

