జెర్సీ చూస్తుంటే క్రికెట్‌ని లైవ్‌లో చూసిన‌ట్లు అనిపిస్తుంది – నాని

జెర్సీ చూస్తుంటే క్రికెట్‌ని లైవ్‌లో చూసిన‌ట్లు అనిపిస్తుంది – నాని

Published on Apr 9, 2019 4:00 PM IST

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం జెర్సీ . క్రికెట్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో..

నాని మాట్లాడుతూ ఈ రోజు నుంచి వ‌చ్చే 10 రోజులు మ‌నం అంద‌రం క‌లుసుకుంటాం. ఈ రోజు నుంచి జెర్సీ ప్ర‌మోష‌న్స్ ను స్టార్ట్ చేస్తున్నాం. నేను సినిమా కోసం త‌గ్గ‌లేదు. సినిమా చేయ‌డం వ‌ల్ల త‌గ్గాను. క్రికెట్ ఆడి, దానికి ప్రాక్టీస్ చేసేట‌ప్పుడు నాకే తెలియ‌కుండా త‌గ్గాను. 36 ఏళ్ల వ‌య‌సులో ఉన్న వ్య‌క్తిగా న‌టిస్తుండ‌టం వ‌ల్ల కాస్త లావ‌వుదామ‌ని అనుకున్నా. కానీ నాకే తెలియ‌కుండా త‌గ్గాను. న‌న్ను నేను మ‌ర్చిపోయి ఇటీవ‌ల‌ 20 సార్లు సినిమా చూశా. ఇందులో నాతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ నానిని మ‌ర్చిపోయి, కేవ‌లం అర్జున్‌ని మాత్ర‌మే చూస్తారు. అంద‌రూ ఈ సినిమాకు క్రికెట్ ప్ర‌ధాన‌మ‌ని అనుకుంటున్నారు. కానీ అంత‌కు మించిన స‌ర్‌ప్రైజ్ ఉంది. ఇది మోస్ట్ ఎమోష‌న‌ల్ సినిమా. నేను ఇంత‌కు ముందు ఏ సినిమా చేసినా స‌రే… `ఇదే ఆఖ‌రి రోజు` అనే ఫీలింగ్ ఉండేది త‌ప్పితే, `అరే.. ఈ రోజు ఇది ఆఖ‌రి రోజా…` అని పెద్ద‌గా ఎప్పుడూ ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం ఎవ‌రో నాతో పాటు క‌లిసి పెరిగిన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్‌కి సెండాఫ్ ఇస్తున్న ఫీలింగ్ వ‌చ్చింది.

నేను, మా నిర్మాత‌ వంశీ ఇద్ద‌రం క్లాస్‌మేట్స్. క్రికెట్ మెయిన్ టీమ్‌లో త‌ను ఉండేవాడు, నేను ఎక్స్ ట్రా ప్లేయ‌ర్స్ లో ఉండేవాడిని. వంశీ కెరీర్లోనూ ఇది మంచి సినిమా అవుతుంది. `వీడు మా డైర‌క్ట‌ర్` అని చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఒక ద‌ర్శ‌కుడు దొరికాడు. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వ‌లేదు. గౌత‌మ్ గురించి చెప్పాల‌నిపించింది. గౌత‌మ్ తొలిసారి వ‌చ్చి క‌థ చెప్పిన‌ప్పుడు, ఇందులో క్రికెట్ అనేది నీడ మాత్ర‌మే, కానీ ఎమోష‌న్ గొప్ప‌గా ఉంటుంది అని అర్థ‌మైంది. క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు చేశాం. ప్ర‌తి రోజూ రాత్రి 6.30కి మొద‌లైతే ఉద‌యం వ‌ర‌కు చేసేవాళ్లం. హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల విప‌రీత‌మైన చ‌లి అనిపించింది క‌దా… అప్పుడు షూట్ చేశాం. సినిమాను ప్ర‌స్తుతం తెలుగులో విడుద‌ల చేస్తున్నాం అని అన్నారు.

చిత్ర నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ మాట్లాడుతూ .. ఏప్రిల్ 12న ఉద‌యం 9 గంట‌ల‌కు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేస్తాం. అదే వారంలో 15 న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాం. ఏప్రిల్ 19న అనుకున్న‌ట్టే సినిమాను విడుద‌ల చేస్తాం. నిన్నా మొన్నా కొంద‌రు నాకు ఫోన్ చేసి, `ఏంటి రిలీజ్ లేదంట‌గదా` అని అడిగారు. అదేం లేదు. ముందే చెప్పిన‌ట్టు 19న క‌చ్చితంగా సినిమాను విడుద‌ల చేస్తాం. షూటింగ్ పూర్త‌యింది. ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. తెలుగు సినిమాలో కొత్త జోన‌ర్‌ని ఓపెన్ చేస్తున్నామ‌నే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం“ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు