న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. నటుడిగానే కాకుండా, తన సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై ఆయన వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్లో వచ్చిన కోర్ట్‌రూమ్ డ్రామా ‘కోర్ట్’ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా కమర్షియల్గానూ పెద్ద విజయం సాధించింది.
అయితే, నాని నెక్స్ట్ నిర్మాణ చిత్రం గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ‘బ్యాండ్ మేళం’ దర్శకుడు సతీష్ జవ్వాజి చెప్పిన కథ నానికి బాగా నచ్చిందని, ఆయనతో సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరిగింది. కానీ, ఈ వార్తలపై వాల్ పోస్టర్ సినిమా నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. మీడియా సంస్థలు ఇలాంటి నిజం లేని వార్తలను ప్రచారం చేయవద్దని కోరింది.
ఇక నాని సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తయిన వెంటనే, సుజీత్ దర్శకత్వంలో రాబోయే ‘బ్లడీ రోమియో’ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. నాని ప్రొడక్షన్లో రాబోయే నెక్స్ట్ సినిమాల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


