ఈ టాక్ తో కూడా నైజాం మార్కెట్ లో ‘ది ప్యారడైజ్’ వసూళ్ల విధ్వంసం!

ఈ టాక్ తో కూడా నైజాం మార్కెట్ లో ‘ది ప్యారడైజ్’ వసూళ్ల విధ్వంసం!

Published on Sep 29, 2026 7:28 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ది ప్యారడైజ్. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ టాక్ తో కూడా ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద ఆగలేదు. భారీ వసూళ్లు కొనసాగిస్తూ దుమ్ము లేపుతుంది.

అయితే నైజాం మార్కెట్ లో ప్యారడైజ్ వసూళ్లు రికార్డ్ మార్క్ అందుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ పి ఆర్ నంబర్స్ ప్రకారం ది ప్యారడైజ్ ఏకంగా 50 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టు తెలుస్తోంది. సో అక్కడ సినిమా ఎంత బలంగా పెర్ఫామ్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఒకవేళ ఫుల్ పాజిటివ్ టాక్ పడి ఉంటే ఆ నంబర్స్ మరింత పడినా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు