జైలర్ 2: ఈసారి అనిరుద్ యునానిమస్ అనిపించుకోవడం గ్యారెంటీ!?

జైలర్ 2: ఈసారి అనిరుద్ యునానిమస్ అనిపించుకోవడం గ్యారెంటీ!?

Published on Sep 29, 2026 8:00 AM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు నటించిన అవైటెడ్ సీక్వెల్ సినిమానే జైలర్ 2. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. ఇక వరుసగా ఒకో అప్డేట్ ఈ సినిమా నుంచి వస్తుంది. ఆల్రెడీ వచ్చిన రెండు పాటలు యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

కానీ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఈ పాటలకు రాలేదు గతంలో అనిరుద్ సాంగ్స్ అంటే వచ్చే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వీటికి రాలేదు. కానీ నేడు రానున్న అవైటెడ్ జైలర్ టైటిల్ ట్రాక్ మాత్రం యునానిమస్ స్పందన అందుకోవడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఈ టైటిల్ ట్రాక్ ఆల్రెడీ పార్ట్ వన్ లో హిట్ అయింది.

సీక్వెల్ విషయానికొస్తే ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన ప్రోమో కట్ లో అనిరుద్ ఇచ్చిన రీమిక్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. సో జైలర్ 2 నుంచి ఇప్పుడు వరకు వచ్చిన రెండు సాంగ్స్ కంటే ఇది బెటర్ గా ఉండడమే కాకుండా అంచనాలు కూడా పెంచుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు