మల్టి స్టారర్ లో నాని నటించడానికి కారణం అదేనట!


నాగార్జున – నాని కథానాయకులుగా నటిస్తోన్న మల్టి స్టారర్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు చాలా పెరిగిపోతున్నాయి. బలే మంచి రోజు – శమంతకమాణి వంటి డిఫెరెంట్ సినిమాలను తెరకెక్కించిన యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. సినిమాలో నాగార్జున ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనుండగా నాని డాక్టర్ పాత్రలో అలరించనున్నాడు.

సినిమాలో ఈ స్టార్ హీరోల పాత్రల మధ్య జరిగే సంభాషణలు ఎంతగానో ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా నాని తన కామెడీ టైమింగ్ తో నవ్విస్తాడట. అతని పాత్ర కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. నాని ఈ సినిమాను ఒప్పుకోవడానికి ప్రధాన కారణం సినిమాలో తన పాత్ర నచ్చడం వల్లేనట. ఇక రష్మిక మందన – ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా సీనియర్ నిర్మాత అశ్విని దత్ వైజయంతి ప్రొడక్షన్ లో ఈ మల్టి స్టారర్ ని నిర్మిస్తున్నారు.

Exit mobile version