విక్రమ్ కుమార్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్న నాని !

15th, February 2018 - 03:07:47 PM

ఫలానా హీరో సినిమాకి వెళితే తప్పకుండా ఎంటర్టైన్మెంట్ దొరుకుంతుందని ప్రేక్షకులు నమ్మే హీరోల్లో నాని కూడా ఒకరు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాల్ని అందుకున్న ఆయన ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తికాగా దీని తర్వాత నాని విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలనే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం దీనిపై కథా చర్చలు జరుగుతున్నయట. ఇది కాకుండా హను రాఘవపూడితో కూడా ఒక సినిమా చేయనున్నాడు నాని. అయితే ఈ రెండింటిలో ఏది ముందుగా మొదలవుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.