శ్రీ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన నాని సతీమణి !

శ్రీ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన నాని సతీమణి !

Published on Jun 12, 2018 5:18 PM IST


గత కొన్ని నెలలుగా నటి శ్రీరెడ్డి సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా హీరో ‘నాని’ని విమర్శిస్తూ వస్తుంది. తాను బిగ్‌బాస్‌-2కు ఎంపిక కాకుండా నాని కుట్ర పన్నారని ఆరోపిస్తూ, తన ఫేస్‌బుక్ పేజీలో అభ్యంతరకరమైన పోస్ట్ లు ట్చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నాని ఆమెకు లీగ‌ల్ నోటీసులు కూడా పంపాడు.

తాజాగా ‘నాని భార్య’ అంజ‌న ఈ వ్యవహారం పై స్పందిస్తూ శ్రీ రెడ్డిని పరోక్షంగా తన ట్విట‌ర్ ద్వారా విమర్శించారు. ‘సినిమా ఇండస్ట్రీ చాలా మంచిది. కానీ, కొన్నిసార్లు ప‌బ్లిసిటీ కోసం వేరే వారి జీవితాల‌పై ఒత్తిడి తెస్తున్న వారు కూడ ఇందులో ఉండటం నన్ను ఇబ్బంది పెడుతోంది. అయితే వారు చేస్తున్న అవాస్తవమైన కామెంట్లను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నుకోండి. ఇదంతా వారు ఇలా చేసే ముందు ఎంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తారో చెప్పడానికే’ అంటూ నాని భార్య ‘శ్రీ రెడ్డి’ గురించి ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు