కలియుగ కర్ణుడిగా నాని

Published on May 24, 2019 3:23 am IST

“జెర్సీ” తో ఓ మంచి ఎమోషనల్ హిట్ తో పాటు టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు హీరో నాని. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట నాని.

పూర్తిగా ప్రతినాయకుడి లక్షణాలుండే పాత్రని నాని కొరకు ప్రత్యేకంగా రూపొందించారంట దర్శకుడు మోహన్ కృష్ణ. ఐతే మహాభారతంలో స్నేహధర్మం కోసం అధర్మం అని తెలిసినా దుర్యోధనుడి పక్షం నిలిచిన కర్ణుడిని పాత్రను పోలి ఉంటుందంట నాని పాత్ర. దాని వలన నాని విలన్ అనే భావన ప్రేక్షకులలో కలగదంటా.

హీరో సుధీర్ ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీ నాని ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గ్యాంగ్ లీడర్” తరువాత నెట్స్ పైకెళ్లే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :

More