మూడు సినిమాలతో రానున్న నాని !

Published on Apr 11, 2019 2:00 am IST

గత ఏడాది కృష్ణార్జున యుద్ధం ,దేవదాస్ సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన నాని కి ఆ రెండు నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ ఈఏడాది ఏకంగా మూడు సినిమాలతో రానున్నాడు నాని. అందులో మొదటిది జెర్సీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. స్పోర్ట్స్ డ్రామా గా రానున్న ఈ చిత్రం ఫై నాని ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు. ఈనెల 19న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక రెండవది గ్యాంగ్ లీడర్. విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. ఆగస్టు లో ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఇక ఈరెండు చిత్రాల తరువాత నాని ‘వ్యూహం’లో నటించనున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూడు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి నాని ఈ ఏడాది ని మెమరబుల్ గా మార్చుకుంటాడు లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :