
డైరెక్టర్ కావాలని వచ్చి అనుకోకుండా యాక్టర్ అవ్వడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని. ఈ ఏడాది ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నాని అప్పుడే మరో సినిమాతో సిద్దమవుతున్నాడు. ఆ సినిమా పేరే ‘భలే భలే మగాడివోయ్’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా చివరి సాంగ్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. నాని, లావణ్య త్రిపాటి షూటింగ్ లో పాల్గొంటున్న ఈ సినిమా షూట్ మరో రెండు రోజుల్లో ముగియనుంది.
టాకీ పార్ట్ పూర్తవగానే ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అంతే కాకుండా నాని ఇప్పటికే తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ మొత్తాన్ని ఫినిష్ చేసాడు. గోవా సాంగ్ షూట్ స్టార్ట్ కావడానికి ముందే నాని తన పార్ట్ డబ్బింగ్ ని ఫినిష్ చేసి సాంగ్ షూట్ మొదలు పెట్టాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశలో ఉన్న ఈ సినిమాని ఆగష్టులో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. లో బడ్జెట్ తో సూపర్ హిట్స్ అందుకున్న మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ – యువి క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.