సుధీర్-నాని మధ్య భీకరమైన ఫైట్…?

Published on Nov 18, 2019 1:06 pm IST

సుధీర్-నాని ముంబైలో ఒకరితో ఒకరు తలపడ్డారట. ముంబై వేదికగా వీరి మధ్య భీకరమైన ఫైట్ నడిచిందట. నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. గతానికి భిన్నంగా నాని ‘వి’ మూవీలో సీరియల్ కిల్లర్ రోల్ చేస్తున్నారని సమాచారం. నెగెటివ్ షేడ్స్ లో సాగే నాని పాత్రపై ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులలో ఆసక్తినెలకొంది. కాగా ప్రస్తుతం ఈ మూవీ ముంబైలో కొన్ని పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుందట.

నాని సుధీర్ మధ్య పోరాటాలు, చేజింగ్స్ వంటి కీలక సన్నివేశాలు తెరకెక్కించారట. దీనితో ముంబై షెడ్యూలు పూర్తయిందని సుధీర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నాని ని వెంటాడే పోలీస్ గా సుధీర్ పాత్ర ఉంటుందని వినికిడి. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చ్ 25న ఉగాది కానుకగా ‘వి’ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More