సెన్సార్ పనులు ముగించుకున్న ‘గ్యాంగ్ లీడర్’

Published on Sep 11, 2019 2:27 pm IST

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నేచ్యురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తాజాగా సినిమా సెన్సార్ పనుల్ని ముగించారు. సెన్సార్ బోర్డ్ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రివెంజ్ కామెడీ డ్రామా కావడంతో కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి కాబట్టి బోర్డ్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

నానితో పాటు దర్శకుడు విక్రమ్ కుమార్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ చిత్ర విజయంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘జెర్సీ’ తర్వాత నాని నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయకిగా నటించగా ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More