ఆ ఫిల్మ్స్ లాగే.. ఈ ఎమోషనల్ ఫిల్మ్ కూడా.. ?

Published on Apr 16, 2019 6:11 pm IST

ఎన్నికలతో హడావుడిగా సాగుతున్నఈ ఏప్రిల్ లో.. మొదటి వారం మజిలీతో నాగ చైతన్య, రెండో వారం చిత్రలహరితో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ ఫిల్మ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. కాగా ఇప్పుడు మూడో వారంలో నాని కూడా ‘జెర్సీ’తో రాబోతున్నాడు. మరి జెర్సీ కూడా ఎమోషనల్ ఫిల్మ్ నే. మరి ఆ లెక్కన మొదటి రెండు సినిమాలు లాగానే ఇది కూడా హిట్ అవుతుందా ? అయితే నానికి మాత్రం ఖచ్చితంగా హిట్ రావాల్సిన పరిస్థితి ఉంది.

ఒకప్పుడు వరుస హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన నాని, గత రెండు సినిమాలు నుండి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. దాంతో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న జెర్సీతో అన్నా మంచి హిట్ అందుకుంటాడేమోనని నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘జెర్సీ’ ప్రోమోస్ టీజర్ అలాగే ట్రైలర్ చూస్తుంటే.. మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తోంది. దాంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పై బాగా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :