నాని సినిమా 1986, 1996 మధ్యలో జరుగుతుందట !

నాని సినిమా 1986, 1996 మధ్యలో జరుగుతుందట !

Published on Jun 19, 2018 2:33 PM IST

హీరో నాని ఇటీవలే తన కొత్త చిత్రం ‘జెర్సీ’ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో నాన్ని క్రికెటర్ గా కనిపించనుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఈ చిత్రం గురించి మాట్లాడిన గౌతమ్ ఇదొక పిరియడ్ స్పోర్ట్స్ డ్రామా అని, 1986, 1996ల మధ్య కాలంలో కథ జరుగుతుందని అన్నారు.

తనలోని టాలెంట్ ను ఆలస్యంగా గుర్తించిన యువకుడు కష్టపడి, అనేక అడ్డంకుల్ని దాటుకుని భారత క్రికెట్ జట్టులో ఎలా స్థానం సంపాదించుకున్నాడు అనేదే ఈ సినిమా కథని, ఇది ఎవరి జీవితాన్నీ బేస్ చేసుకుని ఉండదని, ఈ చిత్రం కోసం నాని క్రికెట్ శిక్షణ తీసుకుంటున్నారని, సెప్టెంబర్ నుండి షూటింగ్ మొదలవుతుందని తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు