బాలయ్య ఫ్యాన్ గా అనంతపూర్ చేరిన నాని

బాలయ్య ఫ్యాన్ గా అనంతపూర్ చేరిన నాని

Published on Jul 29, 2015 3:32 PM IST

nani
మొదటి సినిమాతో తెలుగు వారి ప్రేక్షకుల మదిలో చోటు దక్కించుకున్న యంగ్ హీరో నాని. నాని ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి డైరెక్షన్ లో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా పూర్తి చేసిన నాని తన తదుపరి సినిమా అందాల రాక్షసి ఫేం హను రాఘవాపూడి డైరెక్షన్ లో చేయనున్న సంగతి మీకు తెలిసిందే. 14 వారు ఈ సినిమాని ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అనంతపూర్ లో మొదలైంది. నానిపై కొన్ని సీన్స్ ని కూడా షూట్ చేసారు. నాని భలే భలే మగాడివోయ్ లో చివరి రెండు సాంగ్స్ షూటింగ్ ఫినిష్ చేయాల్సి ఉండడంతో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు.

నిన్నటితో భలే భలే మగాడివోయ్ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. దాంతో నాని బ్యాక్ టు అనంతపూర్ మరియు హను సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. నాని ఈ సినిమాలో అనంతపూర్ కి చెందిన నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపించనున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నాని ఈ ఏడాది మరో రెండు సినిమాలను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. నాని ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఆగష్టులో రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

తాజా వార్తలు