
ఈ ఏడాది ‘భలే భలే మగాడివోయ్’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాని తనను హీరోగా నిలబెట్టిన ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇదివరకే తెలియజేశాం. ఈ సినిమాలో నాని సరసన సురభి, నివేద థామస్ హీరోయిన్స్ గా నటించనున్నారు.
ఈ సినిమా గురించిన వార్తలు బయటకి రాగానే అందరూ ఈ సినిమా కూడా అష్టా – చమ్మా తరహాలోనే ఉంటుందని అందరూ ఊహించుకుంటున్నారు. కానీ అలాంటి వార్తలని పెరగనీయకుండా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. ‘నానితో నేను చేయనున్న సినిమా ఒక ఎమోషనల్ లవ్ స్టొరీ.. ఈ లవ్ స్టొరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా ఉంటుంది. ఈ జానర్ సినిమా తెలుగులో ఇప్పటి వరకూ రాలేదని’ మోహనకృష్ణ తెలిపాడు. ఈ సినిమాని డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు.

