నాని “శ్యామ్ సింగరాయ్” పై పెరుగుతున్న అంచనాలు!

Published on Dec 17, 2021 3:10 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం లో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని వెంకట్ బోయనపల్లి నిర్మించడం జరిగింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ను రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :