‘టక్ జగదీష్’ కోసం నాని కొత్త లుక్ ట్రై చేస్తున్నాడట !

Published on Mar 17, 2020 3:48 pm IST

టాలీవుడ్ లోని మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ ‘నాని’ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా ఇది. షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం. కాగా ఈ సినిమాలో నాని కొత్త లుక్ ట్రే చేస్తున్నాడట. ఫ్రెంచ్ కట్ తో పాటు వెరీ స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడట.

ఇక నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. మరి నిన్నుకోరితో హిట్ అందుకున్న ఈ హిట్ కాంబినేషన్ ఆ హిట్ మేజిక్ ను రిపీట్ చేస్తోందా..? చూడాలి.

ఇక ‘టక్ జగదీష్’ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ సెకెండ్ వీక్ నుండి మళ్ళీ ఔట్ డోర్ లొకేషన్లలో స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో తారాగణం విషయానికి వస్తే.. నాని, రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్, జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :