
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘నాన్నకు ప్రేమతో’. ఎన్.టి.ఆర్ నుంచి వస్తున్న 25వ సినిమా కావడం, విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ డైరెక్టర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. లండన్ లో 80 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం షార్ట్ గ్యాప్ కోసం ఇండియాకి వచ్చిని. కానీ ఈ షార్ట్ గ్యాప్ కాస్తా లాంగ్ గ్యాప్ అయ్యి 40రోజులు దాటినా ఇంకా ఈ చిత్ర టీం ఒక నెల రోజుల పాటు చేయాల్సిన ఫైనల్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్ళలేదు. మొదట నవంబర్ 1 నుంచి అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయారు.
ఈ చిత్ర టీం దీపావళి తర్వాత స్పెయిన్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్టుగానే ఫైనల్ గా స్పెయిన్ షెడ్యూల్ కి ముహూర్తం ఫిక్స్ చేసారు. నవంబర్ 24 నుంచి ఈ చిత్ర టీం స్పెయిన్ షెడ్యూల్ ని మొదలు పెడతారు. కంటిన్యూగా అక్కడ 25 రోజులు షూటింగ్ చేసి డిసెంబర్ 3వ వారం కల్లా నాన్నకు ప్రేమతో టోటల్ షూటింగ్ ని ఫినిష్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ చివరి వారంలో దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆడియో ఆల్బమ్ ని రిలీజ్ చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.