‘నన్ను దోచుకుందువటే’ ఆ రోజు రాబోతుంది !

Published on Jul 16, 2018 11:37 am IST

హీరో సుధీర్ బాబు ఓ కొత్త నిర్మాణ సంస్థ ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ను స్థాపించన విషయం తెలిసిందే. తన నిర్మాణ సంస్థ పై సుధీర్ బాబు మొదటిసారి నిర్మిస్తూ, నటిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీ కూడా ఖారరైంది.

వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 13న ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్త దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నాబా నతేష్ కథానాయకిగా నటిస్తోంది. అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ చేస్తుండగా చోట కె ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కూడ రొమాంటిక్ ఎంటర్టైనర్ గానే ఉండనుంది.

సంబంధిత సమాచారం :