పీరియాడిక్ చిత్రానికి సన్నాహాలు మొదలైయ్యాయి !

పీరియాడిక్ చిత్రానికి సన్నాహాలు మొదలైయ్యాయి !

Published on Oct 21, 2018 12:51 PM IST


‘బాణం’ చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో వైవిధ్యమైన చిత్రాల కథానాయకుడు ‘నారా రోహిత్’ 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సాధ్యమైనంత త్వరలోనే షూట్ కి వెళ్ళనున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమా చేస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని, నారా రోహిత్ కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మిగిలిన నటీనటులను కూడా ప్యాడింగ్ నే తీసుకోనున్నారు. ఇప్పటికే ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ చిత్రానికి డిజైన్స్ కూడా పూర్తి చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు