కరోనా నివారణకు నారా రోహిత్ 30 ల‌క్ష‌లు విరాళం !

Published on Mar 30, 2020 9:01 pm IST

కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు ముఖ్యమంత్రుల సహాయ నిధికి పీఎం సహాయ నిధికి సినీ ప్రముఖులు విరాళంగా ప్రకటిస్తున్నారు.

తాజాగా హీరో నారా రోహిత్ రూ. 30 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు, ప్రధానమంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని కోరారు.

అలాగే హీరో సందీప్ కిషన్ కూడా రూ. 3 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. అదేవిధంగా వివహా భోజనంబు రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 500+ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలను కూడా సందీప్ కిషన్ సహాయం అదించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More