కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన నారా రోహిత్

Nara-Rohith
నారా రోహిత్ ప్రస్తుతం విజయానందంలో వున్నాడు. అతను నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ అసుర నిన్న విడుదలై పాజిటీవ్ టాక్ ని సంతరించుకుంది. రోహిత్ కెరీర్ లోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లు ఈ సినిమాకు దక్కడం విశేషం.

శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ ని కలుపుకుని ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసుకుంది. రోహిత్ నటన, దర్శకుడి టేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ప్రియా బెనర్జీ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version