నారా రోహిత్ సినిమాలో స్వాతి

Swathi

యంగ్ హీరో నారా రోహిత్ వరుసగా డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హీరోగానే కాకుండా ‘అసుర’ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించి నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టాడు. అందులో భాగంగానే నారా రోహిత్ అరణ్ మీడియా వర్క్స్ అనే బ్యానర్ ని ప్రారంభించాడు. తాజాగా నారా రోహిత్ తన బ్యానర్లో నిర్మాతగా ఓ సినిమాని ప్రారంభించనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా కలర్స్ స్వాతిని ఫైనలైజ్ చేసారు.

తమిళంతో పాటు తెలుగులో కూడా స్వమి రారా, కార్తికేయ సినిమాలతో వరుస్ హిట్ అందుకున్న స్వాతి ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించనుంది. వేణు ఉడుగుల దర్శకుడిగా పరిచయం అవనున్న ఈ సినిమాలో నార రోహిత్ సన్నిహితుడు మరియు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. స్వాతి ప్రస్తుతం త్రిపుర సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో ఉంటే నారా రోహిత్ అప్పట్లో ఒకడుండేవాడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Exit mobile version