
నారా ఫ్యామిలీ నుంచి తెరకు చలన చిత్ర రంగంలో అడుగుపెట్టిన యంగ్ హీరో నారా రోహిత్. ఈ ఏడాది ‘అసుర’ సినిమాతో హిట్ అందుకున్న నారా రోహిత్ వరుసగా తన తదుపరి సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్తూ చక చకా ఫినిష్ చేస్తున్నాడు. నారా రోహిత్ ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ అయిన ‘మాన్ కరాటే’ రీమేక్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం బాగా స్లిమ్ అయిన నార రోహిత్ ఇందులో ఓ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని హై రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి.
ఈ సినిమాలో నారా రోహిత్ కి గట్టిపోటీ ఇచ్చే బాక్సర్ పాత్రలో జిల్ ఫేం కబీర్ సింగ్ కనిపించనున్నాడు. ఇటీవలే నారా రోహిత్ – కబీర్ సింగ్ లపై వచ్చే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీ కీర్తి ఫిల్మ్స్ బ్యానర్ పై అశోక్ – నాగార్జున్ లు నిర్మిస్తున్నారు. ఇది కాకుండా నారా రోహిత్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘సావిత్రి’, ‘పండగల వచ్చాడు’ మరియు ‘వీరుడు’ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన శంకర సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంటే, సావిత్రి సినిమాని సెప్టెంబర్ లో లాంచ్ చేయనున్నారు.

