నారా రోహిత్ పీరియాడిక్ చిత్రం ఖాయం అయినట్లే !
Published on Aug 21, 2018 4:05 pm IST

ఎప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లో నటించాలని కోరుకున్నే ‘నారా రోహిత్’ బాణం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని, నారా రోహిత్ కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయినప్పటికీ ఈ రోజు నారా రోహిత్ ఆటగాళ్ల చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెైతన్య దంతులూరితో సినిమా చేస్తున్నానని స్వయంగా చెప్పటం జరిగింది. అంటే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు కూడా ప్యాడింగ్ నే తీసుకోనున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ చిత్రానికి డిజైన్ చేస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook