రియల్ ఇన్సిడెంట్స్ పై నారా రోహిత్ మూవీ

రియల్ ఇన్సిడెంట్స్ పై నారా రోహిత్ మూవీ

Published on May 13, 2015 6:00 PM IST

nara-rohit

‘సోలో’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నారా రోహిత్. ఈ సినిమాలో నారా రోహిత్ తో పాటు ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో పరిచయమైన శ్రీ విష్ణు కూడా నటిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే టైటిల్ ని ఖరారు చేసారని ఇది వరకే తెలియజేశాం. గతంలో ‘అయ్యారే’ సినిమా చేసిన సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకుడు.

సాగర్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ‘1992 – 96 లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారం చేసుకొని ఈ సినిమా తీస్తున్నాం. ఒకరి క్రైమ్ బయోగ్రఫీ మీద ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా ప్రస్తుతం, గతం అనే ఫార్మాట్ లో జరుగుతూ ఉంటుంది. సినిమా మొత్తం హైదరాబాద్ నేపధ్యంలోనే ఉంటుంది. ప్రస్తుతం అప్పటికి తగ్గట్టుగా లొకేషన్స్ ని సెట్ చేసే పనిలో ఉన్నాం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అలాగే ఓ కన్నడ బ్యూటీని ఓ సిస్టర్ రోల్ కోసం పరిశీలిస్తున్నాం అని’ డైరెక్టర్ తెలియజేశాడు. వశిష్ట మూవీస్ బ్యానర్‌పై నూతన నిర్మాతలు హరి, సన్నీరాజు లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్‌ మొదటివారం నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు