
కెరీర్ ప్రారంభం నుంచే డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ వస్తున్న నారా వారి అబ్బాయి నారా రోహిత్ ఈ ఏడాది ‘అసుర’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈసినిమా తర్వాత తన చేయాల్సిన సినిమాలో వరుసగా ఒక అరడజను అన్నా ఉన్నాయి. అందులో కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో చేసిన ‘తుంటరి’ సినిమా షూటింగ్ ని ఇటీవలే ఫినిష్ చేసాడు. ఇది ఫినిష్ చెయ్యగానే పవన్ సాధినేని డైరెక్షన్ లో చేయాల్సిన ‘సావిత్రి’ సినిమా షూటింగ్ ని స్టార్ చేసాడు. ప్రస్తుతం సావిత్రి సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
ఇది కాకుండా ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘పండగల వచ్చాడు’, ‘జో అచ్యుతానంద’ మరియు ‘వీరుడు’ అనే సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. వీటితో పాటు తాజాగా శ్రీవాస్ దగ్గర అసోషియేట్ గా పనిచేసిన ప్రదీప్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాని సాయి కొర్రపాటి నిర్మించనున్నాడు. తాజాగా ఈ సినిమాకి ‘రాజ్ చెయ్యి వేస్తే’ అనే టైటిల్ ని ఖారారు చేసారు. నారా రోహిత్ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది మిడిల్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికంటే ముందు నారా రోహిత్ ఫినిష్ చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి.