నారా రోహిత్ ‘సావిత్రి’ రెండవ షెడ్యూల్ ప్రారంభం

నారా రోహిత్ ‘సావిత్రి’ రెండవ షెడ్యూల్ ప్రారంభం

Published on Nov 17, 2015 3:18 PM IST

Savithri
యంగ్ జనరేషన్ హీరో లలో మంచి పేరు సంపాదించుకుంటున్న నారా రోహిత్ హీరో గా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం ‘సావిత్రి’. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని దర్శకత్వం లో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు.

మొదటి షెడ్యుల్ ను విజయవంతం గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ” ఇది ఒక పూర్తి ఫామిలీ ఎంటర్టైనర్. మొదటి షెడ్యూల్ ని విజయవంతం గా పూర్తి చేసి, ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని ఏలూరు పరిశర ప్రాంతాలలో నవంబరు 18 నుండి ప్రారంభిస్తున్నాం. రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం” అని నిర్మాత డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ, ” ప్రేమా ఇష్క్ కాదల్ చిత్రం తో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు నారా రోహిత్ తో ‘సావిత్రి’ చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాం. రోహిత్ పెర్ఫార్మన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నందిత వంటి అభినయం తెలిసిన హీరోయిన్ తో పని చేయటం ఆనందం గా ఉంది” అని అన్నారు.

ఈ చిత్రం 2016 ప్రధమార్ధం లో విడుదల అవుతుంది.

తాజా వార్తలు