భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ మరియు నరేష్ కలిసి ‘సిల్లీ ఫెలోస్ ‘ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ‘సిల్లీ ఫెలోస్ ‘ చిత్రం సెప్టెంబర్ 7 న విడుదల కానుందని సమాచారం. టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా పూజా ఝావేరి నటిస్తోంది. పూజా గతంలో విజయ్ దేవరకొండ సరసన ద్వారకా చిత్రంతో పాటు ‘సీనియర్ నరేష్’ కుమారుడు నవీన్ నటించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్రంలో కూడా నటించింది. ఇటు నరేష్ కి అటు సునీల్ కి ఈ చిత్ర ఫలితం ఎంతో కీలకం కానుంది.


