మహేష్ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర ఇదేనా !

మహేష్ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర ఇదేనా !

Published on May 28, 2018 9:30 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో అల్లరి నరేష్ కూడ నటించనున్నారని గతంలోనే వార్తలు వెలువడ్డాయి. దాంతో ఇంతకీ నరేష్ సినిమాలో ఎలాంటి పాత్ర వేస్తారు అనే ప్రశ్నలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో నరేష్ సినిమాలో మహేష్ బాబుకు స్నేహితుడిగా కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

కథలో ఈయన పాత్ర కీలకంగా, ఎక్కువ నిడివితో ఉంటుందని కూడ తెలుస్తోంది. అయితే విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాలంటే నరేష్ లేదా వంశీ పైడిపల్లిలో ఎవరో ఒకరు నోరు విప్పే వరకు ఎదురుచూడాల్సిందే. పూజా హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. కె.యు.మోహన్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేయనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు