మహేష్ పై మనసు పారేసుకున్న ‘రాక్ స్టార్’ హీరోయిన్

మహేష్ పై మనసు పారేసుకున్న ‘రాక్ స్టార్’ హీరోయిన్

Published on Nov 18, 2014 6:41 PM IST

nargis-fakhri
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల లిస్టులో మరో హిందీ హీరోయిన్ చేరింది. ‘రాక్ స్టార్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను షేక్ చేసిన ఫారిన్ బ్యూటీ నర్గిస్ ఫక్రి. ఈ హాట్ హీరోయిన్ మహేష్ బాబుపై మనసు పారేసుకుంది. ఇటీవల హైదరాబాద్ లో ఒక ఫాషన్ ఈవెంట్ కి హాజరయిన ఈ అమ్మడు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన మనసులో మాటను వెల్లడించింది.

‘తెలుగు సినిమాలలో నటించాకూడదు అనే నియమాలు ఏమి పెట్టుకోలేదు. దర్శకనిర్మాతలు నన్ను సంప్రదిస్తే నటించడానికి సిద్దంగా ఉన్నాను. మహేష్ బాబు, రానా దగ్గుబాటిలతో నటించాలనుంది. నిజం చెప్పాలంటే నాకు తెలిసిన తెలుగు హీరోలు వారిద్దరే.’ అని సమాధానం ఇచ్చింది.

గతంలో దీపిక పదుకొనె, కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా వంటి బాలీవుడ్ తారలు తెలుగులో మహేష్ బాబు సరసన అవకాశం వస్తే సినిమా చేస్తాం అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు