షూటింగ్ లో ‘నరుడి బ్రతుకు నటన’ !

Published on Nov 1, 2020 2:21 am IST

సిద్ధూ జొన్నలగడ్డ…టాలెంట్ ఉన్న.. యంగ్ హీరో. ఇటీవలే “కృష్ణ అండ్ హిస్ లీల” చిత్రంతో మనోడి టైం మొదలైనట్లు ఉంది. ఆ సినిమాకి అద్భుతమైన టాక్ ఏమి రాకపోయినా సిద్ధూకి మాత్రం వరుస సినిమాలు వస్తున్నాయి. “కృష్ణ అండ్ హిస్ లీల”తో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరోకి ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ క్రేజీ సినిమా చేయబోతున్నాడు. నూతన దర్శకుడు విమల్ కృష్ణ ఈ చిత్రాన్ని క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నాడట. రేపటి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

కాగా ఈ చిత్రానికి “నరుడి బ్రతుకు నటన” అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టడం మాత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. పైగా ఇంతకుముందే సిద్ధూతో హీరోయిన్ గా చేసిన శ్రద్దా శ్రీనాథ్ నే మరోసారి సిద్ధూరో ఈ సినిమాలో కలిసి నటించబోతుంది. మొత్తానికి ఈ చిత్రం పేరు సినిమా పై ఉత్సుకతను పెంచుతున్నాయి. యంగ్ టాలెంట్ కాల భైరవ సంగీతం అందిస్తుండగా సూర్య దేవర నాగవంశీ నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడు విమల్ కృష్ణతో పాటు హీరో సిద్ధూ కూడా రచయితగా పని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More