మెమొరబుల్ ఫ్యాన్ బాయ్ మొమెంట్ – బిగ్ బి తో నాచురల్ స్టార్

Published on Jun 28, 2022 6:20 pm IST

టాలీవుడ్ నటుడు నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా ‘అంటే సుందరానికి’ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి దానితో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా దసరా సెట్స్ మీద ఉంది. ఇక మరోవైపు ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో అందులో కీలక పాత్ర చేస్తున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ సహా ప్రాజక్ట్ కె టీమ్ ని కలిశారు నాని. అంతకముందు బిగ్ బి అమితాబ్ కూడా ప్రాజక్ట్ కె షూటింగ్ అనంతరం తమ టీమ్ తో పాటు హీరో నాని, దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు అమీర్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని తన సోషల్ మీడియాలో వారందరితో దిగిన ఫోటోని ఉదయం పోస్ట్ చేసారు. అయితే దానికి రిప్లైగా ప్రత్యేకంగా బిగ్ బి తో కలిసి రెండు ఫోటోలు పోస్ట్ చేసిన నాచురల్ స్టార్ నాని, ఇది తన లైఫ్ లో మర్చిపోలేని బెస్ట్ ఫ్యాన్ బాయ్ మొమెంట్ అని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొద్దిసేపటి క్రితం బిగ్ బిగ్ కి లవ్ ఎమోజితో ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత సమాచారం :