విజయ్ ఆంటోని హత్య ట్రైలర్‌ను లాంఛ్ చేయనున్న ప్రముఖ హీరో!

Published on Aug 14, 2022 11:27 pm IST


సంగీత దర్శకుడిగా మారిన నటుడు విజయ్ ఆంటోని తన రాబోయే చిత్రం హత్య (తమిళంలో కొలై) తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని గత కొన్ని విడుదలలు నిరాశపరచడంతో అతను ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ని రేపు సాయంత్రం 6 గంటలకు నేచురల్ స్టార్ నాని లాంచ్ చేయనున్నట్టు సమాచారం.

బాలాజీ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖిలాడీ ఫేమ్ నటి మీనాక్షి చౌదరి లీలా అనే పాత్రను పోషించింది, ఈమె మరణం చుట్టూ కథ తిరుగుతుంది. ఇన్ఫినిటీ ఫిమ్ వెంచర్స్ మరియు లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీష్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో రితికా సింగ్, రాధికా శరత్‌కుమార్, మురళీ శర్మ, జాన్ విజయ్ మరియు సంకిత్ బోహ్రా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం :