విడుదల తేదీ : ఫిబ్రవరి 06, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై, రాజా రవీంద్ర, దివి వడ్త్య తదితరులు
దర్శకుడు : కరుణ కుమార్
నిర్మాత: రవి పీట్ల
సంగీతం : అజయ్ అర్షదా
ఛాయాగ్రహణం : నగేష్ బన్నెల్
కూర్పు : మార్తాండ్ కే వెంకటేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో నవీన్ చంద్ర హీరోగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం “హనీ” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఆనంద్ (నవీన్ చంద్ర), లలిత (దివ్య పిళ్ళై) లు ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడతారు. తాంత్రికంగా విద్యలు తెలిసిన ఆనంద్ సులభంగా డబ్బు సంపాదించేందుకు తనకి తెలిసిన విద్యలోని మార్గాలతో అడ్డ దారుల్లో సంపాదించాలని తన పాప (మీరా) తో ఒక ప్లాన్ చేస్తాడు. మరి ఆ ప్రక్రియ ఏంటి? దాని వల్ల తను అనుకున్న డబ్బు సంపాదించగలిగాడా? దీని వల్ల ఎవరు నష్టపోయారు? ఇంకా ఈ ఆధునిక యుగంలో మూఢ నమ్మకాలు నమ్మేవారు ఉన్నారా? అసలు చివరికి ఏమైంది అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఇటీవల వచ్చిన కొన్ని థ్రిల్లర్స్ లానే ఇందులో కూడా కోర్ కాన్సెప్ట్ ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే దీనికి అనుగుణంగా ఫస్టాఫ్ లో కొంతసేపు అలాగే ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు కొన్ని నిమిషాలు పర్వాలేదు అనిపిస్తాయి.
అలాగే సెకండాఫ్ లో అసలు తాము చూపిస్తున్న ప్రక్రియ ఏంటి, దానికి ఇచ్చిన వివరణ చూసే ఆడియెన్స్ కి కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఇక వీటితో పాటుగా నవీన్ చంద్ర ఉన్నంతలో తన పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేసాడు. అలాగే దివ్య పిళ్ళై కూడా తనకి స్కోప్ ఉన్న సీన్స్ లో సాలిడ్ పెర్ఫామెన్స్ కనబరిచారు. వీరితో పాటుగా రాజా రవీంద్ర, దివి వడ్త్య తమ పాత్రల్లో సూట్ అయ్యి బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో కేవలం మెయిన్ కాన్సెప్ట్ బాగుంది తప్పితే దానికి తగ్గ రేంజ్ లో కథనం ఏ కోశాన కనిపించలేదు. ఫస్టాఫ్ లో కొన్ని చోట్ల పర్వాలేదు కానీ సెకండాఫ్ లో మాత్రం సన్నివేశాలు పరమ రొటీన్ అండ్ బోరింగ్ గా సాగుతాయి. ఎలాంటి ఎంగేజింగ్ గా లేకుండా వీక్ రైటింగ్ తో డల్ గా సాగుతాయి.
అంతేకాకుండా సినిమాలో నవీన్ చంద్ర ఎందుకు అలా చేస్తున్నాడు అనే పాయింట్ కి వెళ్లేందుకు చాలా సమయం తీసుకున్నారు. పోని ఆ తర్వాత నుంచి అయినా కథనం ఇంట్రెస్టింగ్ గా సాగిందా అంటే అది కూడా లేదు. వీటితో ఈ చిత్రం ఒక బోరింగ్ థ్రిల్లర్ ఫీల్స్ నే మిగులుస్తుంది.
పైగా ఒక టైం తర్వాత నవీన్ చంద్ర, దివ్య పిళ్ళైల పాత్రలు కూడా తెలిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా చిన్నారి పాత్రకి హనీ అనే మరో పాత్ర ఉంటుంది. ఇది సినిమాలో ఆడియెన్స్ కొంత సమయం తర్వాత చికాకు తెప్పిస్తుంది. అలాగే ఆ పాపకి తన తల్లే ఇచ్చే ఓ విషాద ముగింపుకి పొంతన ఉండదు.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. అజయ్ ఆర్షదా సంగీతం డీసెంట్ గా ఉంది. నగేష్ బన్నెల్ కెమెరా వర్క్ బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఇంకా గ్రిప్పింగ్ గా కట్ చేయాల్సింది.
ఇక దర్శకుడు కరుణ కుమార్ విషయానికి వస్తే.. తన నుంచి ఇది మరో డిజప్పాయిటింగ్ అవుటింగ్ అని చెప్పక తప్పదు. తను కేవలం కోర్ కాన్సెప్ట్ ని బాగానే తీసుకున్నారు కానీ దీనికి తగ్గ కథనం మాత్రం ఏమాత్రం ఎంగేజింగ్ గా లేకుండా నడిపించారు. కేవలం 2 గంటల సినిమానే అయినప్పటికీ ఈ సినిమా చాలా బోరింగ్ గా ఏమాత్రం ఎగ్జైట్ చేయకుండా సాగదీసారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘హనీ’ చిత్రంలో కోర్ కాన్సెప్ట్ ఇలాంటి థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారిని ఒకింత ఎగ్జైట్ చేస్తుంది. అలాగే నవీన్ చంద్ర, దివ్య పిళ్ళైలు తమదైన పెర్ఫార్మన్స్ లు అందించారు. కానీ ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కి అంతే ఆసక్తికరమైన కథనం కూడా అవసరం కానీ అది ఇందులో మిస్ అయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ మిస్ ఫైర్ అయ్యింది. వీటితో ఈ సినిమా అంచనాలు అందుకోలేదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team


