నవీన్ చంద్ర ‘షో టైం’ మూవీ ట్రైలర్ లాంచ్!

Naveen chandhra show time e

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలోనే చాలా వచ్చాయి. తన నుంచి మరో సినిమా అలరించడానికి వస్తుంది. అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “షో టైం”. ఈ రోజు ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ప్రజెంట్ చేస్తున్నారు.

థ్రిల్లింగ్ గా సాగిన ఈ ట్రైలర్.. లాంచ్ ఈవెంట్లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ.. చాలా మంచి సినిమా చేసినప్పుడు ఆసక్తితో పాటు ఉత్సాహం, భయం కూడా ఉంటుందన్నారు. డైరెక్టర్ మదన్ తో పని చేయడం చాలా బాగా అనిపించిందని అన్నారు. ఎడిటర్ శరత్, డీఓపీ వినోద్ శ్రమ ఎంతో ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రతో పని చేయడం చాలా మంచి అనుభూతి అని చెప్పారు. ప్రొడక్షన్ డిజైనర్ సుప్రియ ఎంతో కష్టపడి, ఇష్టపడి పని చేశారు అన్నారు. రాజరవీంద్ర తో పని చేయడం చాలా కొత్తగా ఉందన్నారు. ఆయన కూడా చాలా కష్టపడ్డారు అని చెప్పారు. నరేష్ తో పని చేయడం కూడా చాలా బాగా అనిపించింది అన్నారు. ఆయనతో చాలా సరదగా పనిచేశామన్నారు. సినిమాలో పని చేసిన పిల్లలు కూడా చాలా బాగా చేశారు అన్నారు. ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్న ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాపై ఎంత నమ్మకం ఉంటే ఆయన ప్రెజెంట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు అని నవీన్ చంద్ర అన్నారు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే అని , కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమాలనే చేస్తా అని చెప్పారు. ఇక షో టైం సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుందని చెప్పారు. జులై 4న మీతో కలిసి నేను కూడా చూస్తా అని చెప్పారు. అలాగే కామాక్షి అద్భుతమైన నటీ అన్నారు. తన గురించి కచ్చితంగా ఇండియా మొత్తం మాట్లాడుకుంటారు అని చెప్పారు. కచ్చితంగా సినిమా అందరకి నచ్చుతుందని చెప్పారు”.

Exit mobile version