నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘హనీ’. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా, మూఢనమ్మకాలు మరియు డార్క్ సైకాలజీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సాధారణ హారర్ చిత్రాలకు భిన్నంగా, రిచువల్-బేస్డ్ (క్షుద్ర పూజల) కాన్సెప్ట్‌తో సాగిన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. నిశ్శబ్దం, చీకటి కోణాలు, నవీన్ చంద్ర స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. దర్శకుడు కరుణ కుమార్ ఈసారి ఒక విభిన్నమైన మార్మిక ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. దివి, రాజా రవీంద్ర పాత్రలు కూడా ఇందులో వైవిధ్యంగా కనిపిస్తున్నాయి..
అజయ్ అరసాడ అందించిన నేపథ్య సంగీతం, నాగేష్ బానెల్ ఛాయాగ్రహణం టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


