పవన్ కోలుకోవాలని నవీన్ పొలిశెట్టి ఆసక్తికర పోస్ట్.!

Published on Apr 17, 2021 1:03 pm IST


నిన్ననే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మరి ఈ సమయంలో పవన్ ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉంది అన్న వార్త పర్వాలేదు అనిపించినా అభిమానులు ఎవరికీ పవన్ కి నెగిటివ్ వచ్చే వరకు ప్రశాంతత వచ్చేలా లేదు. మరి మరో పక్క మన టాలీవుడ్ ప్రముఖ నటులు అంతా కూడా పవన్ త్వరగా కోలుకోవాలని తమ ప్రార్ధనలు తెలియజేస్తున్నారు.

మరి లేటెస్ట్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి పవన్ కోలుకోవాలని తనదైన శైలిలో పోస్ట్ పెట్టాడు. పవన్ “వకీల్ సాబ్” లోని అల్వాల్ సీన్ కోసం ప్రస్తావిస్తూ అక్కడ పవన్ డైలాగ్ మాడ్యులేషన్ అద్భుతం అని తర్వాత తన లాయర్ చిట్టి కోసం చిన్న ఫన్ చేసాడు. అలాగే పవన్ “ఖుషి” సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ తీసుకున్న నాటి నుంచి తన ప్రేమ ఉందని ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టుగా నవీన్ పొలిశెట్టి తెలిపాడు.

సంబంధిత సమాచారం :