న‌వీన్ పొలిశెట్టి తరువాత సినిమా అదేనా ?

న‌వీన్ పొలిశెట్టి హీరోగా స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఈ సక్సెస్ తో న‌వీన్ పొలిశెట్టి హీరోగా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో నవీన్ పొలిశెట్టి ఓ సినిమా చేయడానికి 30 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు.

స్వప్న సినిమాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రం కూడా మంచి కంటెంట్ బేస్డ్ మూవీ అట. ఇక ఈ సినిమాకు ఎవరు డైరెక్షన్ చేస్తారో తెలియాల్సి ఉంది. కాగా న‌వీన్ పొలిశెట్టి తరువాత సినిమా ఇదే అని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత ఎలాగూ `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా ప్రొడక్షన్ లో మరో సినిమా చెయ్యడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా మరో ఇద్దరు నిర్మాతలు కూడా నవీన్ పొలిశెట్టితో సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నారట.

Exit mobile version