షూటింగ్ ముగించుకున్న మణిరత్నం సినిమా !
Published on Jun 2, 2018 3:05 pm IST


స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘చెక్కచివంతవానం’ అనే సినిమా చేసున్నారు. తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకుంది. అబుదాబి, సెర్బియా వంటి దేశాల్లో కూడా ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది.

సోషల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం న్యూక్లియర్ ప్లాంట్ నేపథ్యంలో ఉండనుంది. ఈ సినిమాలో అరవిందస్వామి, విజయ్ సేతుపతి, శింబు, అదితిరావ్ హైదరి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, డయానా వంటి స్టార్ నటీ నటులు నటిస్తున్నారు. ఈ సినిమాపై దక్షిణాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook