సమీక్ష : “నాయకుడు” – కాన్సెప్ట్ బాగున్నా స్లోగా సాగుతుంది

సమీక్ష : “నాయకుడు” – కాన్సెప్ట్ బాగున్నా స్లోగా సాగుతుంది

Published on Jul 15, 2023 3:04 AM IST
Nayakudu Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్, లాల్ మరియు విజయ్ కుమార్

దర్శకుడు : మరి సెల్వరాజ్

నిర్మాత: ఉదయనిధి స్టాలిన్

సంగీతం: ఎఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్

ఎడిటర్: సెల్వ ఆర్కే

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

రీసెంట్ గా తమిళ నాట మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా “నాయకుడు”. మరి ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ మరియు వడివేలు లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..రామాపురం అనే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే మహారాజు(వడివేలు) కాగా తాను అణగారిన వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యే అవుతాడు. అయితే తన కొడుకు రఘు వీరా(ఉదయనిధి స్టాలిన్) ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ కాగా వీరిద్దరూ ఎన్నో ఏళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేస్తారు. అయితే తండికొడుకులు అయ్యిన వీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం మానేస్తారు? మహారాజు జీవితంలో జరిగే ఓ ఊహించని సంఘటన ఏంటి? వారు మళ్ళీ మాట్లాడుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ముఖ్యమైన ప్లస్ పాయింట్స్ లో సీనియర్ నటుడు వడివేలు పెర్ఫామెన్స్ కోసం చెప్పాలి. మన తెలుగు ఆడియెన్స్ కి ఎక్కువగా కమెడియన్ గానే ఆయన తెలుసు కానీ ఈ చిత్రంలో తాను పోషించిన సీరియస్ పొలిటీషియన్ పాత్ర అందులో అయన నటన అద్భుతంగా ఉంటుంది.

అలాగే మరో వెర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా ఈ చిత్రంలో నటించాడు. తాను కూడా ఓ సీరియస్ పొలిటీషియన్ గా ఇంప్రెస్ చేస్తాడు. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్ సహా ముఖ్య పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ లు కూడా తమ పాత్రలను నీట్ గా ఫినిష్ చేశారు. అయితే ఈ సినిమాలో పలు ఇంపార్టెన్స్ సీన్స్ కి రెహమాన్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సన్నివేశాలు బాగా ఎఫెక్టీవ్ గా ఎలివేట్ అయ్యాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతి చిత్రం లానే ఈ సినిమాలో కూడా ప్రామిసింగ్ కంటెంట్ ఉన్నప్పటికీ అదే స్లో నరేషన్ లో అయితే సినిమా కనిపిస్తుంది. దీనితో ఇలాంటి ఇంట్రెస్టింగ్ డ్రామాస్ లో కాస్త ఫాస్ట్ స్క్రీన్ ప్లే కోరుకునే వారిని ఇది డిజప్పాయింట్ చేస్తుంది.

అలాగే మరికొన్ని సీన్స్ కి ఇంకా బెటర్ చేయాల్సింది. అలాగే కీర్తి సురేష్ రోల్ బాగున్నప్పటికీ ఒకానొక సన్నివేశంలో ఆమె పాత్ర తాలూకా ఇంపార్టెన్స్ తగ్గించినట్టుగా అనిస్తుంది. అలాగే మరికొందరు నటులు లాల్, విజయ్ కుమార్ లాంటి వారిపై చూపించిన సన్నివేశాలు ఇంకా బలంగా ప్రెజెంట్ చేసి ఉంటే మరింత ఆసక్తిగా అనిపించేవి.

అలాగే మరో మిస్టేక్ సినిమాలో తెలుగు డబ్బింగ్ కి సినిమాలో చూపించే కంటెంట్ ని ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. తెలుగు వెర్షన్ లో కనిపించాల్సిన పేర్లు, రాతలు అసహజంగా ఉన్నాయి. ఓ మంచి సినిమా తీసుకొని డబ్ చేస్తున్నాం అన్నపుడు తెలుగుకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

సాంకేతిక వర్గం :

 

సినిమాలో ఒరిజినల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ పైన చెప్పినట్టు తెలుగు డబ్బింగ్ విలువలు అయితే పూర్తి స్థాయి ఎఫర్ట్స్ మేకర్స్ పెట్టలేదు. డబ్బింగ్ బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ లు బాగున్నాయి. ఎడిటింగ్ మరికాస్త బెటర్ చేయాల్సింది.

ఇక దర్శకుడు మారి సెల్వరాజ్ విషయానికి వస్తే..తాను మంచి కంటెంట్ తీసుకున్నారు అయితే కాస్త రేసి స్క్రీన్ ప్లే డిజైన్ చేసి ఉంటే మరికాస్త బాగుండేది అలాగే తాను ఇచ్చిన సందేశం అయితే సినిమాలో బాగుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “నాయకుడు” అనే పొలిటికల్ డ్రామాలో మెయిన్ లీడ్ నటన సినిమాలో కథాంశం ఆకట్టుకుంటాయి. అయితే స్లోగా సాగే నరేషన్ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మరి సినిమా స్లో గా ఉన్నా పర్వాలేదు కాస్త తక్కువ అంచనాలు పెట్టుకుని ఓ డీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ సినిమాని ఓసారికి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు