లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు ను సృష్టించిన నయన్ !

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు ను సృష్టించిన నయన్ !

Published on Aug 21, 2018 4:49 PM IST

లేడీ సూపర్ స్టార్ నయన తార తమిళ భాషలో నటించిన చిత్రం కొలమావు కోకిల(కోకో). ఆగస్టు 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈచిత్రం మూడు రోజులకుగాను తమిళనాడు లో 11కోట్ల గ్రాస్ ను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు అక్కడ విడుదలైన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం గా ‘కోకో’ రికార్డు సృష్టించింది.

నయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నెల్సన్ తెరకెక్కించాడు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం ఫై సినీ ప్రముఖులు సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ , కరణ్ జోహార్ లు ప్రశంశలు కురిపించారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈచిత్రాన్ని నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు