లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న టాప్ హీరోయిన్ నయనతార తాజాగా నటించిన చిత్రం ‘కొలమావు కోకిల’. మంచి అంచనాల మధ్య ఆగస్టు 17న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.
ఇక తమిళనాడు ఈచిత్రం 9రోజులకుగాను 20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి కొత్త రికార్డు సృష్టించింది. సౌత్ లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో ఈ తరహా కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రం కూడా ఈ సినిమానే కావడం విశేషం.
నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని’కోకో కోకిల’ పేరుతో ఆగస్టు 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.


