‘సూర్య 39’ కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ?

Published on Sep 11, 2019 8:00 am IST

తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో స్టార్ హీరొయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రోల్ లో కాజల్ అగర్వాల్ కూడా కనిపిస్తోందట. కాకపోతే కాజల్ పాత్ర నిడివి చాల తక్కువని సమాచారం. ఇక ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ సూర్య 39వ సినిమాకి సంగీతం సమకూర్చనున్నారు. ఇమ్మాన్ సూర్య సినిమాకి పనిచేయడం ఇదే మొదటిసారి. అలాగే ఈ చిత్రం కోసం కెమెరామెన్ గా ప్రముఖ కెమెరామెన్ వెట్రీ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాను జనవరిలో పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక సూర్య – శివ కాంబినేషన్ అంటే.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండనుంది. వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకున్నా.. ఎట్టకేలకూ అది సెట్స్ మీదకు వెళ్తుంది. దీనికి తోడు సూర్య ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో.. అంతకు మించి పవర్ ఫుల్ గా సూర్యని చూపించాలనుకుంటున్నాడట శివ. అయితే శివ, అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించి తమిళంలో భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ తెలుగులో మాత్రం ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మరి శివ – సూర్య కాంబినేషన్ లో వచ్చే సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధిస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More